నిజాంసాగర్, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 24వ తేదీన నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం… వివరాల్లోకి వెళితే… తేదీ నవంబర్ 24వ తేదీ ఉదయం సమయంలో నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిదిలోని ఆరేడు గ్రామ శివారులో నిజాంసాగర్ డ్యామ్ 20 గేట్ల దగ్గర 1 వ నెంబర్ గెట్ ర్యాంప్ వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి శవాన్ని గుర్తించారు.
గోనె సంచిలో కట్టి పడవేసినారని ఆరేడు గ్రామ పంచాయితీ సెక్రెటరీ ఇచ్చిన సమాచారంపై పోలీసులు వెళ్లి శవాన్ని ఒకటవ నెంబర్ గెట్ ర్యాంపు నుండి బయటకు తీయించి, శవాన్ని పరీక్షించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతుని ఎడమవైపు ఛాతి పై ఆర్.ఏ.ఎల్.ఏ అని ఇంగ్లీష్‌లో పచ్చబొట్టు ఉన్నందున దాని ఆధారంగా విచారణ చేపట్టగా మృతుడు డాకుర్ గ్రామము ఆందోల్ మండల నివాసుడని వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇట్టి మృతుడు కమలపూర్ గ్రామం పెద్ద శంకరంపేట్ మండటానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తర్వాత సదరు వివాహిత తమ అక్రమ సంబంధం కొనసాగించడానికి అంగీకరించక పోయేసరికి, మృతుడు ఆ వివాహిత కోసం ఆమె గ్రామం కమలపూర్‌కు వెళ్లగా, ఆమె భర్త, ఆమె స్నేహితుడు ఆమె ముగ్గురు కలిసి వారి ఇంటిలో మృతుడిని చంపేసి గొనె సంచిలో కట్టి వేసి వివాహిత భర్తకు అల్లుడు వరుస అయిన వ్యక్తి యొక్క ఆటోలో శవాన్ని తీసుకొని నిజాంసాగర్ డాం 20 వరద గేట్ల దగ్గర పడేసినారు.
ఇట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యూడిషల్ రిమాండ్‌కు పంపారు. ఇట్టి కేసును ఛేదించిన బాన్సువాడ రురల్ సి. ఐ చంద్రశేఖర్, సయ్యద్ హైమద్‌్ ఎస్‌ఐ నిజాంసాగర్, ఏఎస్‌ఐ రాములు పోలీసు సిబ్బంది వస్సి, వీరభద్ర, సంగమేశ్వర్, రమేష్, రాజు, శ్రీశైలంలను బాన్సువాడ డిఎస్‌పి అభినందించారు. మృతుడి పేరు అరేటిక్యాల రాజు (34)గా వెల్లడిరచారు.