కామారెడ్డి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎంలు నిల్వ ఉంచిన గోదాంను శనివారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గోదాంకు సీజ్ చేసి ఉన్న తాళాలను చూశారు.
బందోబస్తు వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.