డిచ్‌పల్లి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఎస్. శమంతకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. శమంత తెలంగాణ సాహిత్యం శ్రామిక జీవన చిత్రణ (2000-2010) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సెమినార్ హాల్‌లో జరిగిన ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం నుంచి ప్రొఫెసర్ వెల్దండ నిత్యానందరావు హాజరై పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కవిత్వం, కథ, నవలా సాహిత్యాలలో గల కులవృత్తులు, చేతివ ృత్తులు, సంచార వృత్తులకు చెందిన శ్రామిక జీవనాన్నిబీ కర్షక, కార్మిక, శ్రామిక వ ృత్తులకు చెందిన సాహిత్యాంశాలను గ్రహించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించిన పరిశోధకురాలి కృషిని ప్రశంసించారు.
వైవా వోస్‌కు ఆర్ట్స్ డీన్ ఆచార్య పి. కనకయ్య చైర్మన్‌గా, బిఓఎస్ డా. బాలశ్రీనివాస మూర్తి కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలుగు అధ్యయనశాఖ అసోషియేట్ ప్రొఫెసర్లు డా.వి. త్రివేణి, డా. కె. లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సిహెచ్. లక్ష్మణ చక్ర వర్తి, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్. శమంత పిహెచ్. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి, ప్రిన్సిపాల్ డా. నాగరాజు, కంట్రోలర్ డా. అరుణ, పిఆర్‌ఓ అబ్దుల్ ఖవి, విద్యార్థి నాయకుడు పిల్లి శ్రీకాంత్, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, తదితర న్యాయవాద బృందం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.