డిచ్‌పల్లి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అధ్యాపకులుగా చేరిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మండి అడ్మినిస్ట్రేషన్ భవనము వరకు బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డా బాలకిషన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు కల్పించకుండా 2014 అధ్యాపకుల పట్ల వివక్షతను చూపుతున్నారన్నారు.
పదోన్నతుల విషయంలో తగిన చర్యలు సత్వరమే మొదలు పెట్టాలని లేదంటే పదోన్నతుల కోసం చేసే నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతమవుతామని తెలిపారు. సోమవారం నుంచి 2014 అధ్యాపకులంతా నల్లబ్యాడ్జీలు ధరించి తమ ధర్నా కొనసాగిస్తామని, అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పదవులు కూడా రాజీనామా చేశామని విధులలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా. లక్ష్మణ చక్రవర్తి, డా.నాగరాజు, డా.మహేందర్, డా. ఎం.డి. జమీల్ అహ్మద్, డా. రమణా చారి, డా. కృష్ణమయి, డా. ఖవి జరీనా, సంపత్, నవీన తదితరులు పాల్గొన్నారు.