ఆర్మూర్, డిసెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణములోని బార్ అసోసియేషన్ న్యాయవాదుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు పియుసి చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 5 లక్షల రూపాయలు సిడిపి ప్రత్యేక నిధులు మంజూరు చేశారు.
ఎమ్మెల్యే నిధుల మంజూరు పత్రాన్ని ఆదివారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్యకి, కార్యవర్గ సభ్యులకు, న్యాయవాదులకు అందచేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సంగీత ఖాందేష్, కోశాధికారి కొండి పవన్, సంయుక్త కార్యదర్శి గుంజాల సుదర్శన్, మహిళా ప్రతినిథి సవితా చక్రు, ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా భాయ్, తెరాస సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, ప్రభుత్వ న్యాయవాది ఎం.కె. నరేందర్, న్యాయవాదులు జక్కుల శ్రీధర్, జిజి రామ్ తదితరులు పాల్గొన్నారు.