కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ కొతొల గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి, వీడిసి చైర్మన్ పల్లె నరసింహులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, మానవ హక్కుల నిర్మాత ఓటు హక్కు కల్పించిన, సమానత్వాన్ని చాటి చెప్పిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఉండకుంటే మహిళలకు స్వేఛ్ఛ సమానత్వం హక్కులు ఉండకపోయేవని పేర్కొన్నారు. అదేవిధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ క్రమంలో తాము కూడా ముందు వరుసలో ఉంటామన్నారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పురం సరస్వతి, ఎంపిటిసి ఉమాదేవి, పర్వతరెడ్డి, ప్రసన్న కుమార్, హనుమాన్లు, పాల రాములు, కొత్తల యాదగిరి, లింగం, సాయిలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.