కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భూములు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం భూములు కోల్పోతున్న రైతులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సమావేశం నిర్వహించారు.
రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. అసైన్ మెంట్ భూములు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, లింగంపల్లి, జనగాం, కరడ్పల్లి గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.