కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు. 2022 లో శాఖల వారీగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధి హామీ అధికారులు ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, పాఠశాలలో ఖాళీ స్థలాలు గుర్తించి మొక్కలు నాటాలని కోరారు. శాఖల వారీగా నాటే మొక్కల పై సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించి మొక్కలు నాటే విధంగా చూడాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అటవీ శాఖ అధికారిని నిఖిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.