భీమ్‌గల్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 33 కోట్లతో భీమ్‌గల్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, 70 సంవత్సరాలలో 33 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు గతంలో ఎన్నడూ శంకుస్థాపన జరగలేదన్నారు.
భీంగల్‌కు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి పూర్తి చేసుకున్నామన్నారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయవలసి ఉన్నదని, తప్పకుండా వస్తది అన్నారు. భీమ్‌గల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉన్నందున గుర్తించి మున్సిపాలిటీగా చేసుకున్నామన్నారు. చేసుకున్న మరుక్షణం నుంచి 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కొరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. బాల్కొండ రింగ్ రోడ్డు, బైపాస్ మెయిన్ రోడ్డు విస్తరణ రోడ్డు మధ్యలో డివైడర్స్ మధ్యలో చెట్లు, ఎల్‌ఈడి సెంట్రల్ లైటింగ్, రోడ్లు అంటేనే అభివృద్ధి, రోడ్లున్న పట్టణం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
18 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శంకుస్థాపనలు చేయడం, లింబాద్రిగుట్ట ఫోర్ లైన్ రోడ్ కల్పించడం, లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అభివృద్ధి జరగాలంటే నాయకులు మనసు పెట్టి పని చేయాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజ్, నాన్వెజ్ 3 కోట్లతో, ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల అర్బన్ పార్క్ 75 లక్షలు, అంగడి బజార్‌లో శ్మశాన వాటికలు ప్రతి గ్రామపంచాయతీలో అయినవని కోటి రూపాయలతో ఏర్పాటు ప్రణాళిక, వాగు ఒడ్డుకు బోయ గల్లిలో 30 లక్షలతో నందిపల్లి, 30 లక్షలు మొగల్ చెరువు, 15 లక్షలు టాయిలెట్స్, బాత్రూంకు 15 లక్షలు ఏర్పాటుకు పేదల కోసం కళ్యాణ మంటపం కోటిన్నర రూపాయలతో ఏర్పాటు చేయడానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
పెద్దపల్లి భీమ్‌గల్ మెయిన్ రోడ్డు సర్వాంగ సుందరంగా అయిందని, సెంట్రల్ లైటింగ్ మధ్య డివైడర్స్ మధ్యలో మొక్కలు, ఓపెన్ జిమ్స్, వంద పడకల హాస్పిటల్ కరోనా వల్ల కొంత ఆలస్యం అయిందని హాస్పిటల్ పని పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.