కామారెడ్డి, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.
డిసెంబర్ 15 లోగా గ్రామాల వారీగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి చంద్రశేఖర్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.