కామారెడ్డి, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్ సెషన్స్ కొనసాగుతాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అదేశానుసరం ఐసీడీఎస్, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక బృందాలను ఇంటింటిని సందర్శించి టీకా తీసుకోని వారిని గుర్తించి వారికి టీకా కేంద్రంలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు. తక్కువ సంఖ్యలో వాక్సినేషన్ అయిన ప్రాంతంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 18 వయసు పైన కలవారందరికి కోవిడ్ టీకాలు ఇస్తున్నట్లు, అన్ని మండలాల్లో వైద్యులు మండల అధికారుల సమన్వయంతో లక్ష్యం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
నేడు డిఎం అండ్ హెచ్‌వో విద్యనగర్‌లో సీనియర్ సిటీజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 కేంద్రంను తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లాలో 100 శాతం అయ్యే వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని డిఎం అండ్ హెచ్‌వో తెలిపారు.