కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ ఓ నెగెటివ్ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే ఓ నెగిటివ్ రక్తం ఉంటుందని, ఓ నెగిటివ్ రక్తం అవసరం అని తెలియజేయడంతో ముందుకు వచ్చి రక్తదానం చేసిన రక్తదాతను అభినందించారు.
రక్తదానానికి యువకులు ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.