కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. యాసంగి సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోనే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.
శనగ, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, నువ్వులు, పెసర పంటలు పండిరచేలా అవగాహన కల్పించాలని సూచించారు. వరి సాగు చేసుకునే రైతులు పంటను అమ్ముకునేందుకు సొంతగా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి ఎడిఎ రత్న, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ు