నిజామాబాద్, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ జిల్లా తరపున ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలలలో పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.
పరీక్షలో విజేతలకు మండల విద్యాశాఖ అధికారి వనజ, ప్రధానోపాధ్యాయులు రాజన్న, లింగం, గణిత ఫోరం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్మూర్ డివిజన్ ఇంచార్జి గంట అశోక్, మండల అధ్యక్షులు రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి గంగ నరసయ్య, గణిత ఉపాధ్యాయులు పాల్గొని బహుమతులు అందజేశారు. పరీక్షలో 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలు ఈనెల 21న జిల్లా స్థాయిలో నిర్వహించనున్న పరీక్షల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.