కామారెడ్డి, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.
పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని యాసంగి వడ్ల కొనుగోలు సమస్య ఒక్క తెలంగాణలో మాత్రమే ఎందుకు వస్తున్నదని, హుజురాబాద్ ఓటమి తరువాత ప్రజలపై కక్ష కట్టి కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కేంద్ర మంత్రులు పార్లమెంటులో అన్ని రకాల విస్తరణలు ఇచ్చిన యాసంగీ వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వరి సాగు వద్దని చెప్తుందని అన్నారు.
వాన కాలం వడ్ల కొనుగోలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ యేటికి ఆ యేడు మద్దతు ధర పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పంటలు ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. యాసంగీ వడ్లు కొనకపోతే ఉద్యమం తప్పదన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.