నిజామాబాద్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.
వారు ప్రభుత్వ నిబంధనల మేరకు సీనియారిటీ ప్రకారం జాబితాను మరొకసారి పరిశీలించవలసిందిగా సూచనలు ఇచ్చారు. ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు దుర్గాప్రసాద్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.