ఆర్మూర్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు గుజరాత్ రాష్ట్రంలోని మహమ్మదావద్ జిల్లాలోని కెడాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో జరగనున్న 34వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు.
బాలురు :
- పి .స్నేహిత రెడ్డి (ఆక్స్‌ఫర్డ్ హై స్కూల్ బ్రాహ్మణపల్లి)
- జి. ప్రతాప్ రెడ్డి (కొండూరు)
- బి ప్రశాంత్ (క్రాంతి హై స్కూల్ పెర్కిట్)
- ఆర్.అనిల్ (గురుకుల పాఠశాల ఆర్మూర్)
- డి వినీష్ (మానస హై స్కూల్ మామిడిపల్లి)
బాలికలు :
- ఎల్ రాణి, 2.జి సౌందర్య, 3.ఎస్ సౌమ్య రాణి, 4. జై వైశాలి, 5. కే సృజన (గురుకుల పాఠశాల సుద్ధపల్లి), 6. ఎం.మీనా (గురుకుల పాఠశాల ధర్మారం) ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.గంగా మోహన్ తెలిపారు.
రాష్ట్ర బాలబాలికల జట్టుకు కోచ్ మేనేజర్‌లుగా ఏం.గంగా మోహన్ ( జడ్.పి.హెచ్.ఎస్ మిట్టపల్లి), హెచ్ అనికేత్ (సుద్ధపల్లి గురుకుల పాఠశాల బాలికల అకాడమీ కోచ్), ఈ. నరేష్ (ఆర్మూర్ బాలుర గురుకుల పాఠశాల అకాడమీ కోచ్) బి మౌనిక (సుద్ధపల్లి గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు) వ్యవహరిస్తున్నారు.