నిజామాబాద్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల లోకల్ కేడర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు.
సీనియార్టీ ఇంపార్టెంట్ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను ప్రతి ఉద్యోగి దగ్గర డీటెయిల్స్ వెరిఫికేషన్ చేస్తూ డాటా ఎంట్రీ చేస్తున్నామని, సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. బుధవారం ఉదయం వరకు పరిశీలించి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ గోవింద్, డిఎఫ్వో సునీల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.