జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కుమార్‌ పంపిణీ చేశారు.

రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి చెక్కులను పంపిణీ చేసారు. వీరికి ఐదేళ్ల పాటు పెన్షన్‌ను కూడా ప్రతి నెలా వారి వారి అకౌంట్‌లలో ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రాథమిక సభ్యులు ఆరుగురు కరోనా బారినపడి మృతి చెందగా మరో ఇద్దరు అనారోగ్యం కారణంగా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు.

వీరిలో నిజామాబాద్‌ నగరానికి చెందిన జలపాతం ఎడిటర్‌ సిహెచ్‌ మధు, నందిపేట్‌ మండల ఆంధ్రభూమి విలేకరి దర్శనం అశోక్‌, ధర్పల్లి మండల సాక్షి రిపోర్టర్‌ అల్లాడి శేఖర్‌, డిచ్‌పల్లి టీవీ ఫైవ్‌ రిపోర్టర్‌ వేణుగోపాల్‌, ఆర్మూర్‌ ప్రజావాణి విలేఖరి రాచర్ల రాజేశ్వర్‌, ఆర్మూర్‌ టిజి 24 రిపోర్టర్‌ జ్ఞానేశ్వర్‌లతోపాటు బోధన్‌కు చెందిన ఉర్దూ రిపొర్టర్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, పిట్లంకు చెందిన మల్లాగౌడ్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల కమిటీ, రాష్ట్ర కన్వీనర్‌, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు, యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆరోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ రాజేష్‌, జిల్లా నాయకులు ప్రసాద్‌, మోహన్‌, శేఖర్‌, ప్రమోద్‌, దస్తాగౌడ్‌, ఖుర్శీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »