నిజామాబాద్, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కీ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహింఎవసఱ.
ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇంచార్జ్ తాహెర్ బిన్ హందాన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ మధుయాష్కి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మధుయాష్కి గౌడ్ పాత్ర మరువలేనిదని అన్నారు.
అధికార పార్టీలో ఉన్న కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను పలుమార్లు పార్లమెంట్‌లో ప్రస్తావించడమే కాకుండా పార్లమెంట్ వెలుపల కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని, రెండు పర్యాయాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించారని గుర్తు చేశారు. అందులో ముఖ్యంగా నిజామాబాద్ నగరానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం, అలాగే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడంతో పాటు నిజామాబాద్ నగరంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పాస్పోర్ట్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను మధుగౌడ్ అమలు పరచడం జరిగిందని వేణురాజ్ అన్నారు.
మధుయాష్కి జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలని ఆశిస్తూ నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ ప్రధాన కార్యదర్శి నరందీప్ చింటు, మైనార్టీ నాయకులు జావిద్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, జగడం సుమన్, కాంగ్రెస్ నాయకులు దయాకర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రకళ, మల్లికాబేగం, విజయలక్ష్మి, ఉష, మహిళా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు రేవతి, చింటూ, లక్కీ, శివ, రాజు, చింటు, తదితరులు పాల్గొన్నారు.