నిజామాబాద్, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా లోకల్ కేడర్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి అయినందున బుధవారం రాత్రి 10 గంటల వరకు ఆర్డర్స్ సంబంధిత ఉద్యోగులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలకేషన్ స్త్రెంత్ మ్యాచ్ అవ్వాలని, డాటా ఎంట్రీ కరెక్టుగా చేయాలన్నారు. దాదాపుగా డాటా ఎంట్రీ అంతా పూర్తి అయిందని, ప్రింట్ తీసుకొని కరెక్టుగా ఉన్న ఆర్డర్స్ బుధవారం రాత్రికి నిజామాబాద్, కామారెడ్డి కేటాయించిన వారికి ఇవ్వాలన్నారు. పనిచేసే చోటనే పోస్టింగ్ వచ్చిన వారు ఒక్కరోజులో జాయిన్ కావాలన్నారు.
వేరే జిల్లాకు మారిన వారు మూడు రోజుల్లో జాయిన్ కావాలన్నారు. ఈ నెల 16 నుండి 18వ తేదీలలో జాయిన్ అయ్యి రిపోర్టు చేయాలని, రిపోర్టు చేసిన వ్యక్తికి వేకెన్సీ లో మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలన్నారు. ఒక విద్యాశాఖ తప్ప అన్ని శాఖల అధికారులు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.