బలహీన పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగినట్లు బరువు, వయస్సు తగ్గినట్లు ఎత్తు పిల్లలు ఉండే విధంగా చూడాలని ఐసిడిఎస్‌ అధికారులకు సూచించారు. పిల్లల బరువును తూకం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రంలో బలహీనమైన పిల్లలు ఉంటే అదనంగా పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. రికార్డులు పరిశీలించారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలని కోరారు. ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో చేయించుకోవాలని గర్భిణీలకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, సిడిపిఓ రోచిష్మా, అంగన్‌వాడీ కార్యకర్త భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »