కామారెడ్డి, డిసెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మైసయ్యకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.
కాగా పట్టణ కేంద్రానికి చెందిన యాద శ్రీనివాస్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 5 వ సారి వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు చెప్పారు. గతంలో 4 సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించినందుకు రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.