కామారెడ్డి, డిసెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం కామారెడ్డి బ్లడ్ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్ సహకారంతో ఏబి పాజిటివ్ రక్తాన్ని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో సకాలములో అందజేసి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. గత 14 సంవత్సరాల నుండి ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేయడం జరుగుతుందని, మానవజీవితానికి సార్థకత సేవతోనే వస్తుందని అన్నారు.
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ చందన్, అర్చన పాల్గొన్నారు.