బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు కూడా కొనను అని, వడ్లు పండిరచద్దు అని ప్రెస్‌ మీట్లు పెట్టి చెప్తున్న అధికార పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలి అని ధర్నాలు చేస్తామనడం విడ్డురమని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వడ్లు పండిచొద్దు అని చెప్పకపోతుండే అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకులను ధర్నాలు చేయమని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చుంటామని సిద్ధమై ఇప్పటి నుండే సన్నద్ధం చేస్తున్నట్టుగా ఉందని అన్నారు. కామారెడ్డిలో అవినీతి అంతానికి బీజేపీ నడుం బిగించిందని, ఎవరికి సమస్య వచ్చినా అండగా ఉంటానని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »