నిజామాబాద్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, కాలూరు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జడ్.పి.హెచ్‌ఎస్ కాలూర్ హైస్కూల్‌కు 03.18 ఎకరాల స్థలం ఉందన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడిరదన్నారు. ఎలాంటి నిధుల కేటాయింపులు, అనుమతులు లేకుండానే, కనీసం పనుల కేటాయింపు లేకుండానే ప్రహరీ గోడ నిర్మాణం తలపెట్టారన్నారు.
స్కూలు స్థలాన్ని 25 ఫీట్ల వరకు, మొత్తంగా అర ఎకరం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు వదిలి, ప్రహరీ గోడ నిర్మిస్తున్నారన్నారు. దీనిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి ఫిర్యాదు చేస్తే, వెంటనే పని ఆపించారన్నారు. కానీ రెండు రోజుల క్రితం మళ్లీ అక్రమంగా ప్రహరి గోడ పనులను ప్రారంభించారన్నారు. తక్షణమే అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆపివేయించాలన్నారు. నిర్మించిన గోడను కూల్చి వేయించాలన్నారు.
జడ్.పి.హెచ్.ఎస్ కాలూర్ పాఠశాల స్థలాన్ని వెంటనే సర్వే చేయించాలని కోరామన్నారు. కబ్జాకు గురైన పాఠశాల స్థలాన్ని పాఠశాలకు తిరిగి కేటాయించాలన్నారు. ఎలాంటి అనుమతులు, సంబంధిత శాఖల నుండి నిధులు, కనీసం పనుల కేటాయింపు లేకుండానే అక్రమంగా చేపడుతున్న నిర్మాణాన్ని కూల్చి వేయించాలని కలెక్టర్‌ని కోరామన్నారు.
భవిష్యత్తులో పాఠశాల స్థలం కబ్జాకు గురి కాకుండా, హద్దు రాళ్ళు లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి విచారణ చేపడతామని, సర్వే జరిపిస్తామన్నారు. పాఠశాల స్థలాన్ని కబ్జా చేస్తే సీరియస్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో మాదస్తు రాజారెడ్డి, నరసింహ స్వామి, కోర్వ దశరత్, పట్వారీ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.