కామారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బలహీనమైన పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య, ఐకేపీ సిబ్బంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సహకారం అందించాలని కోరారు.
బలహీనంగా ఉన్నా గర్భవతులకు అదనంగా పోషకాహారం అందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, సిడిపివోలు, పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.