కామారెడ్డి, డిసెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పల్లె నవీన్ కుమార్ బిక్నూర్ నుండి పెద్ద మల్లారెడ్డికి బైక్ పై వస్తున్న క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన కాళ్లు, చేతులు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి వైద్యశాలలో చేర్పించారు.
ఆపరేషన్ నిమిత్తమై వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం బ్లడ్ బ్యాంకులో లేకపోవడంతో పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్ రెడ్డి వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మెడికల్ ఏజెన్సీ యజమాని రాజశేఖర్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపాడు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత రాజశేఖర్‌ను, సహకరించిన పెంజర్ల సురేష్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, అర్చన పాల్గొన్నారు.