కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిమ్మ దామోదర్ రెడ్డి, ఏజిపి నరేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ జూనియర్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.