నిజామాబాద్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాలు అమర్చు శిబిరం ఈ నెల డిసెంబర్ 29న కొలతలతో ప్రారంభమై నూతన సంవత్సరం జనవరి 2వ తేదీన కృతిమ కాలు అమరికతో ముగుస్తుందని క్లబ్ అధ్యక్షులు గట్టు ప్రకాష్ తెలిపారు.
గత 12 సంవత్సరాలుగా రోటరీ కృతిమ అవయవ కేంద్రం ద్వారా జైపూర్ ఫుట్ శిబిరాలను ప్రతి సంవత్సరం మూడు నుండీ నాలుగు పర్యాయాలు నిర్వహించి బాధితులకు కృత్రిమ కాలు అమర్చి వారి జీవితానికి ఆనందాన్ని అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
శిబిరానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినందుకు అభినందించారు. అలాగే కెవిఆర్ మెమోరియల్ హైదరాబాద్ వారు వారి ట్రస్ట్ తరపున శిభిరం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారన్నారు.
ఎవరైనా బాధితులు తమ కాళ్ళను కోల్పోయి బాధ పడుతూ ఉన్నట్లయితే స్థానిక ప్రజలు ఎవరైనా సరే వారి పేర్లను 92469905 నెంబర్‌కు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించగలరని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ రోటరీ సర్వీస్ చైర్మన్ హరి ప్రసాద్, లింబ్ సెంటర్ చైర్మన్ విజయ రావు, క్లబ్ కార్యదర్శి శ్రీకాంత్ జవహర్, శ్రీరాం సోనీ, జితేంద్ర మలాన్ని, కమల్ ఇన్నాని, జుగల్ సోనీ, సతీశ్ షాప్‌ా పాల్గొన్నారు.