కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసంఘటిత, వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈశ్రం భీమ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈశ్రం రిజిస్ట్రేషన్ సిఎస్సి సెంటర్ల ద్వారా చేయించాలని కోరారు. ఈఎస్ఐ, పిఎఫ్ లేనివారు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా రాకుండా కార్మికులందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా చూడాలని కోరారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ ప్రియా, కమిషనర్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.