హైదరాబాద్, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అయితే ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.