నిజామాబాద్, డిసెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్‌గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను ఎంబిబిఎస్ చదివిస్తున్న సంగతి తెలిసినదే. పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య, తండ్రి విద్యాసాగర్ నిజామాబాద్‌కు చెందిన విద్యార్థినిని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉస్మానియాలో ఎంబిబిఎస్ చదువుతూ, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతుంది.
విద్యార్థి తండ్రికి శుక్రవారం రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ సంవత్సరానికి గాను 25 వేల రూపాయల చెక్కు అందజేశారు. ఇది నాలుగోసారి.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు స్వఛ్చందంగా పేద పిల్లల చదువు కొరకు అది ఎంబీబీఎస్ చదువు కొరకు అండగా నిలవటం చాలా ఆనందంగా ఉందని, మొన్ననే పది రోజుల క్రితం ఒక విద్యార్థికి 25 వేల చెక్ ఇచ్చారు, ఇప్పుడు మరో విద్యార్థినికి 25 వేలు ఇవ్వడం నిజముగా మిమ్మల్ని అభినందిచక తప్పదు అని రెవెన్యూ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.
కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, డిచ్పల్లి తహసిల్దార్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధ్యక్షులు మహేష్, సంఘ నాయకులు కార్తిక్ రెడ్డి, దత్తాద్రి, దీపక్ పాల్గొన్నారు.