రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణపేటలోని శ్రీదత్త బృందావన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) అనుమతి ఇవ్వగా పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి అనుబంధ గుర్తింపు దక్కింది.

ఇంటర్‌ విద్యార్హత ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ఒక్కో కోర్సులో 100 సీట్లు ఉంటాయి. ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశామని, ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. జనవరి 2న సీట్లు కేటాయిస్తామని, 10 నుంచి తరగతులు మొదలవుతాయన్నారు. మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా పొందొచ్చని ఆయన తెలిపారు.

బీఈడీ కోర్సులకు దరఖాస్తులు…

బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ ప్రకారం సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను జనవరి 2న ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 3 నుంచి 8 మధ్య కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. జనవరి 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. కాగా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »