కామారెడ్డి, డిసెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామరెడ్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా జిల్లా ¸అధ్యక్షురాలు అరుణతార మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అరుణ తార మాట్లాడుతూ మంచి వక్త, మంచి కవి, మేధో సంపన్నుడు, రాజనీతిలో అపర చాణక్యుడు అయిన వాజపేయి బిజెపి పార్టీకి వన్నె తెచ్చిన వ్యక్తి అని, ప్రధానిగా దేశానికి సమర్థమంతమైన నాయకత్వం అందించిన ఆయన దేశభక్తి విషయంలో ఆయన తర్వాతనే ఎవరైనా అని కొనియాడారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపి అజాత శత్రువుగా పేరుపొందారని, కార్గిల్ యుద్ధ సమయంలో ప్రధానిగా ఆయన సాధించిన విజయం మరువలేనిదని, సామాన్య కార్యకర్త నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన నేడు బీజేపీ పార్టీలో పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు ఆదర్శం అని, సిద్ధాంతం, దేశం విషయంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చిన ముందుకు సాగారన్నారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.