కామారెడ్డి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ పార్టీని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకులని అన్నారు.
అదేవిధంగా ఎలక్ట్రానిక్ రంగంలో గాని, కంప్యూటర్ రంగంలో గాని ఆనాడు రాజీవ్‌గాంధీ చేసిన కృషి ఫలితమే నేడు మనం ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైందన్నారు. అలాగే ఇందిరాగాంధీ కూడా పేద ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఎన్నో సేవలు అందించిన గొప్ప నాయకురాలన్నారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్, కౌన్సిలర్లు అన్వర్ హైమద్, పేరు, పాత శివ కృష్ణమూర్తి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమ్ముల ముకుందం, మాజీ కౌన్సిలర్లు గోనే శ్రీనివాస్, బట్టు మోహన్, దాత్రిక సత్యం, జొన్నల నరసింహులు, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ ఖదీర్, మొహమ్మద్ సర్వర్, శ్రీధర్ గౌడ్, సయ్యద్ సాజిద్, మహమ్మద్ అతిక్, మహమ్మద్ సాజిద్, హైమద్, హనుమండ్ల రవి, శంకర్, సయ్యద్ ఎజాజ్, కుర్షీద్, భారీ, లక్క పతిని గంగాధర్, సురేష్, జమీల్, పిప్పిరి చందు, హోసన్న తదితరులు పాల్గొన్నారు.