వేల్పూర్, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డిజిటల్ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు.
కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ కె. ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని మంచి ర్యాంకు సాధించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ఇట్టె రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతి తర్వాత ఏం సాధిస్తారు? అని పిల్లలను అడిగితే ఒక అమ్మాయి శైలజ పదో తరగతి తర్వాత డాక్టర్ కోర్స్ చదువుతానని చెప్పింది. అందుకు స్పందించి అమ్మాయిని ఇంటర్మీడియట్ బైపీసీ తానే చదివిస్తానన్నాడు.
రోటరీ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షులు మంచిర్యాల సురేష్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు ఇన్చార్జ్ హెడ్మాస్టర్ పెంట జలంధర్ రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కోశాధికారి శ్రీధర్, దాఖలు రాజు, రాజేందర్, పి. చరణ్ రెడ్డి, రోటరీ క్లబ్ మెంబెర్స్ విజయ సారథి. పుష్పాకర్ రావు. గోపి విద్య, లింబాద్రి, కాంతి గంగారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కె. సుమలత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.