కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ 2022 పై గురువారం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు పట్టణ పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడారు.
సేవ స్థాయి పురోగతి, స్వఛ్ఛ నగరాల ర్యాంకింగ్‌పై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.