కామారెడ్డి, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన జిల్లా అధ్యక్షుడు,కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షుడు పాత బాలు, మోటూరి శ్రీకాంత్ గుప్తా లకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతానని, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య భవనం ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు.
నూతన అధ్యక్షులు మర్యాదపూర్వకంగా శుక్రవారం స్పీకర్‌ను కలిసి సన్మానించారు. అదేవిధంగా నూతనంగా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పాత బాలు గుప్తాను, ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షుడు నార్ల రత్నాకర్‌ను కామారెడ్డి పట్టణ నూతన కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ కార్యదర్శి మొగిలిపల్లి భూమేష్ గుప్తా, అతి మామూల రమేష్ గుప్తా, రాజ్ కుమార్, కంకణాల శ్రీశైలం గుప్తా, అడ్డాకుల రాజ్ కుమార్ గుప్తా, వివేకానంద్ అల్లాడి శ్రీకాంత్ గుప్తా, ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షుడు వల్లిపిశెట్టి భాస్కర్ గుప్త, బాన్సువాడ ఆర్యవైశ్య పెద్దలు, కామారెడ్డి ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.