కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు

బీర్కూర్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో 19 గురుకుల పాఠశాలల వసతి గృహాలు ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్రంలో రెండు వందల ఎనభై బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

వసతి గృహం విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ఉన్నత వర్గాల విద్యార్థులకు దీటుగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. పేద కుటుంబాల అమ్మాయిల పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మి పథకంను ప్రారంభించారని చెప్పారు. కెసిఆర్‌ కిట్టు ద్వారా అమ్మాయి మొదటి కాన్పుకు రూపాయలు 13 వేలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రభుత్వ వసతి గృహాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అంతకుముందు బీర్కూర్‌ గ్రామపంచాయతీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌, ఉమ్మడి జిల్లాల డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా రైతు బంధు కన్వీనర్‌ అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్‌డిఓ రాజా గౌడ్‌, ఎంపీపీ రఘు, సర్పంచ్‌ సప్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »