గాంధారి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీపీ రాధా బలరాం నాయక్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ హాజరు కానున్నట్లు తెలిపారు. మండల అధికారులు తమ తమ డిపార్టుమెంట్‌కు సంబంధించిన నివేదికలతో హాజరు కావాలని కోరారు.
అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృషికి తీసుకువచ్చి, పరిష్కారం చేసుకోవడానికి సమావేశం వేదిక అవుతుందని ప్రజాప్రతినిధులు తప్పకుండా హాజరయ్యే విధంగా చూడాలన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ రాదా బలరాం నాయక్, తహసీల్దార్ గోవర్ధన్ తెలిపారు. స్థానిక రైతు వేదిక ఆవరణలో 149 లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారని అన్నారు. అదేవిదంగా ప్రతి లబ్ధిదారులైన మహిళలకు ఎమ్మెల్యే తన స్వంత ఖర్చుతో చెక్కుతో పాటు చీరలను అందజేస్తారని, ప్రతి గ్రామం నుండి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అధికారులు హాజరుకవాలని కోరారు.