ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం 15 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు లోపు హైస్కూలు జూనియర్‌ కాలేజ్‌ డిగ్రీ కాలేజ్‌ పాలిటెక్నిక్‌ ఐటిఐ చదువుతున్న అర్హత గల విద్యార్థుల పాటు బయట ఉన్న ఆ వయసు గ్రూపు వారందరికీ కూడా వ్యాక్సిన్‌ తక్షణమే ప్రారంభించి దానితోపాటు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒకేసారి ఈ రెండు కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అర్హత గల విద్యార్థులు ఉన్న అన్ని విద్యా సంస్థలలో వ్యాక్సినేషన్‌ వేయాలని పేర్కొన్నారు. రోజుకు 30 వేల చొప్పున లక్ష్యంతో జిల్లాలో సుమారు ఒక లక్షా 20 వేల మంది ఈ ఏజ్‌ గ్రూప్‌ పిల్లలు అందరు కూడా వ్యాక్సిన్‌ అందించాలన్నారు. డాక్టర్లు సూచించిన పిల్లలు మినహా మిగతా అందరూ కూడా నూటికి నూరు శాతం వ్యాక్సిన్‌ వేయాలన్నారు.

మరోవైపు ఏరోజుకారోజు వ్యాక్సిన్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆర్‌.డి.వో.లు వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ ఈ లక్ష్యం పూర్తి చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో తగు ఫిర్యాదులు స్వీకరించడానికి, ఇతర విషయాలకు డిఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన 8309219710 కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు.

కంట్రోల్‌ రూమ్‌లో వివరాలు నమోదు చేసి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఇంచార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, డిఎంహెచ్‌వో సుదర్శనం, ఆర్‌డివోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, డిఈఓ దుర్గాప్రసాద్‌, డిఐఈఓ రఘు రాజ్‌, గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »