మండల సభలో బినామీలకూ అవకాశం కల్పిస్తాం

గాంధారి, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల సర్వ సభ్య సమావేశంలో బినామీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అవకాశం కల్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్‌ అన్నారు. సోమవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే సురేందర్‌ హాజరైయ్యారు.

సమావేశానికి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరైయ్యారు. అందులో కొంతమంది సర్పంచ్‌ భర్తలు సమావేశానికి హాజరు కాగా, బినామీల హాజరుపై స్పందించిన ఎమ్మెల్యే తాను సమావేశంలో ఎవరిని అయినా అనుమతి ఇస్తానని, గ్రామంలోని సలహాలు స్వకరించడానికి సలహాదారులుగా బినామీలను అనుమతియిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

యాసంగిలో పండిన ఎలాంటి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయదని సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఈ సంవత్సరం తెలంగాణలో యాసంగిలో రైతులు పండిరచిన ఎలాంటి పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. కావున రైతులు లాభాదాయక పంటల వైపు మొగ్గుచూపాలని అన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్యాయ పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతు బాంధవుడన్నారు. రైతు బంధును ప్రతి రైతు అకౌంట్‌లలో జమ చేయడం జరిగిందని అన్నారు.50 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో జమ చేసినందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మండల సభ తీర్మానం చేసింది. వ్యవసాయ శాఖపై సమీక్షించారు. ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వాక్సినేషన్‌ ప్రారంభమైనందున ప్రతి గ్రామంలో పిల్లలను గుర్తించి వాక్సిన్‌ వేయడం జరుగుతుందని అన్నారు.

అనంతరం వివిధ శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ భజన్‌ లాల్‌, ఎంపీడీఓ సతీష్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సాయికుమార్‌, సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »