కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త సంవత్సరం 2022 లో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ నూతన సంవత్సరం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
ఎప్పటిలాగానే బార్, బెంచ్ రిలేషన్స్ కొనసాగుతాయని పరస్పర సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, మొబైల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ ధ్రువ మాట్లాడారు. అనంతరం 2022 కేకును న్యాయమూర్తులతో కలిసి గజ్జల బిక్షపతి కేకు కట్ చేశారు. కార్యక్రమంలో లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, ప్రతినిధులు గోనెల జగన్నాథం, పిపి నంద రమేష్, నరేందర్ రెడ్డి, దేవుని సూర్యప్రసాద్, కాసుల శ్రీనివాస్, దేవేందర్ గౌడ్, షబానా బేగం, లతా రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.