ఎంపిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

ఆర్మూర్‌, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై పోలీస్‌ స్టేషన్‌లో టిఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్‌ అభిమానులను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని కుట్ర చేస్తున్న ఎంపీ అరవింద్‌ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్‌ మండల, పట్టణ నాయకులు ఆర్మూర్‌ ఎస్‌.హెచ్‌.ఓ. సైదేశ్వర్‌కి పిర్యాదు చేసినట్టు తెలిపారు.

ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ రాజకీయంగా, అభివృద్ధి పరంగా టిఆర్‌ఎస్‌తో గాని, కేసీఆర్‌తో పోటీ పడలేక, ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామనే అభద్రత భావనతో కేసీఆర్‌పై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న అరవింద్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

పిర్యాదు ఇచ్చిన వారిలో ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య, మండల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆలూర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పూజ నరేందర్‌, సర్పంచుల ఫోరమ్‌ మండల అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, ఉపాధ్యక్షుడు టి.సి.సాయన్న, మండల మహిళ విభాగం అధ్యక్షురాలు కుమ్మరి లక్ష్మి, పట్టణ సీనియర్‌ నాయకులు ఖందేశ్‌ శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు జన్నేపల్లి రంజిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »