కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లోని నర్సరీలలో బ్యాగ్ ఫీలింగ్ పూర్తిచేయాలని సూచించారు. మండలాల వారీగా బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటడం పూర్తిచేయాలని కోరారు. నాటిన మొక్కలకి నీటిని అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఉపాధి హామీ ఏపీడీ శ్రీకాంత్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.