నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్.ఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న గడ్కొల్లో జరిగిన జిల్లా జనరల్ కౌన్సిల్లో ఎన్నుకోబడ్డ ప్రగతిశీల యువజన సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.
జిల్లా అధ్యక్షులుగా బట్టు కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. సుమన్, ఉపాధ్యక్షులుగా మారుతి గౌడ్, సహాయ కార్యదర్శిగా ఆల్గోట్ సాయిలు, కోశాధికారిగా నారాయణ లతోపాటు మొత్తం 19 మందితో నూతన కార్యవర్గం జిల్లా జనరల్ కౌన్సిల్లో ఎన్నుకోబడిరదన్నారు.
ఈ సందర్బంగా పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.కిషన్ ఎం.సుమన్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని నినదించి ఉరికొయ్యలని ముద్దాడిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పీ.వై.ఎల్ జిల్లా తొలి కన్వీనర్ కిరణ్ కుమార్ల అమరత్వ స్ఫూర్తితో ప్రగతిశీల యువజన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని అన్నారు.
పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ వాయిదా
కోవిడ్, ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని నిబంధనలు విధించిన నేపథ్యంలో జనవరి 8, 9 తేదీలలో ఆర్మూర్లో జరగాల్సిన పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ వాయిదా వేస్తున్నామని తిరిగి ఈనెల 16వ తేదీ తర్వాత ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు.