డిచ్‌పల్లి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ప్రొ. లింగమూర్తి, మాజీ వైస్ ఛాన్స్‌లర్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ హాల్‌లో జరిగిన అర్థశాస్త్ర అధ్యాపకుల సమన్వయ సమావేశానికి హాజరై సదస్సు నిర్వహణకు దిశానిర్దేశనం చేశారు. ఫిబ్రవరిలో జరిగే రెండు రోజుల సదస్సులో తెలంగాణ అభివృద్ధికి రాజకీయ ఆర్థిక విశ్లేషణ, ఆర్థిక అసమానతలు, పట్టణీకరణ అనే అంశాల పట్ల లోతైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సెక్రటరీ ప్రొ. శివారెడ్డి పాల్గొని సదస్సు విజయవంతం చేయుటకు వివిధ కేటగిరీలను కమిటీలను గుర్తించారు. తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో లోకల్ సెక్రెటరీ డా.సంపత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. అక్కినపల్లి పున్నయ్య, డా. పాత నాగరాజు, డా.రవీందర్ రెడ్డి, డా. వెంకటేశ్వర్లు, డా. సప్న, డా.శ్రీనివాసులు, డా. దత్త హరి తదితరులు పాల్గొన్నారు.