నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఎనిమిది మంది సభ్యులు గల టీం బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిశారు. జిల్లాలోని 26 గ్రామాలు 2021 స్వఛ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పథకానికి ఎంపికైన నేపథ్యంలో టీమ్ లీడర్ కిషోర్ ఆధ్వర్యంలో డిఆర్డిఓ చందర్‌తో కలిసి కలెక్టర్ చాంబర్లో ఆయనను కలిసి స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్‌కు సంబంధించి వివరించారు.
వీరు ఎంపికైన గ్రామాలలో నాలుగు రోజులపాటు పర్యటించి అక్కడి వివరాలను క్యాప్చర్ చేసి ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.