రేపటికల్లా పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్‌డివోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్‌పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పిల్లలపైన ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. ఒక లక్ష 20 వేల పిల్లలు లక్ష్యం కాగా ఇప్పటికీ కేవలం 26వేల మందికి మాత్రమే వేసినందున 8వ తేదీ నుండి సెలవులు ఉన్న నేపథ్యంలో రేపటికల్లా పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన 300 టీంలను ప్రతి విద్యా సంస్థకు రేపు ఉదయానికల్లా ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆర్డీవోలు డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో విద్యా సంస్థ అధికారులు ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక డ్రైవ్‌తో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

అర్హత గల విద్యార్థులు ఉన్న ప్రతి విద్యా సంస్థలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవోలు బాధ్యత తీసుకొని పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సెల్‌ కాన్ఫరెన్సులో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, ఆర్‌డివోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వోలు, డిఐఓ శివ శంకర్‌, వైద్య శాఖ అధికారులు, డీఈవో దుర్గాప్రసాద్‌, డిఐఈఓ రఘు రాజ్‌, గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »